ఏ ఉద్యమానికైనా సిద్ధం: వైఎస్ షర్మిల హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-06 10:17:15  IST  )

ప్రధాని మోడీ ఓట్ల దొంగ అని వైఎస్ షర్మిల విమర్శించారు

ఏ ఉద్యమానికైనా సిద్ధం: వైఎస్ షర్మిల హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Pm Modi) ఓట్ల దొంగ అని వైఎస్ షర్మిల(Ys Sharmila) విమర్శించారు. హర్యానా(Haryana)లో రాహుల్(Rahul) పేల్చింది హై ఓల్టేజ్ హైడ్రోజన్ బాంబు అని వ్యాఖ్యానించారు. 25లక్షల దొంగ ఓట్లు సృష్టించి సర్కార్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. హర్యానాలో బీజేపీ(Bjp) గెలుపు కోసం 25 లక్షల దొంగ ఓట్లను ECI చేర్చిందని వ్యాఖ్యానించారు. దేశం ముందు ECI బాగోతాన్ని, సత్యాన్ని రాహుల్ దేశం ముందు పెట్టారన్నారు. హర్యానాలో 8 ఓట్లకు ఒకటి దొంగ ఓటు అని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ గెలిచేదన్నారు. కాంగ్రెస్‌కి బీజేపీకి మధ్య ఓట్ షేర్ పెద్ద తేడా లేదని తెలిపారు. కేవలం 1.18లక్షల ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలో వచ్చిందన్నారు. 0.7 ఓట్ల తేడా మాత్రమే బీజేపీ మెజారిటీ అని చెప్పారు. హర్యానాలో జరిగింది సర్కార్ చోరీ అని వ్యాఖ్యానించారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారని, ఇది గమనించి దొంగ ఓట్లను ECI సారధ్యంలో చేర్చారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

ప్రజల కోసం ఏ ఉద్యమానికైనా తాను సిద్ధమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఓట్ చోర్ గద్దె చోర్ క్యాంపెయిన్‌‌లో భాగంగా గురువారం ప్రజల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి 17.65 లక్షల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. దేశంలో మోడీ ఓట్ చోరీ కి పాల్పడ్డారు అని నమ్మారన్నారు. ఢిల్లీకి ఈ సంతకాలను పంపిస్తున్నామని చెప్పారు. ఓట్ చోర్ గద్దీ చోడ్ నినాదాన్ని ఆంధ్రా రాష్ట్రంలో గ్రామ గ్రామాన తీసుకు వెళ్ళామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Next Story