YS Sharmila: GST కాదు..అది గబ్బర్ సింగ్ ట్యాక్స్

by velandi.Saikiran |

మోడీ స‌ర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోడీ GST 2.O ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని మండ

YS Sharmila: GST కాదు..అది గబ్బర్ సింగ్ ట్యాక్స్
X

దిశ‌, వెబ్ డెస్క్ : మోడీ స‌ర్కార్ పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోడీ GST 2.O ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని మండిప‌డ్డారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) పేరుతో 2017-18 నుంచి 2024-25 మధ్య 8 ఏళ్లలో దోపిడీ చేసింది రూ.55,44,897 కోట్లు అంటూ ట్వీట్ చేశారు ష‌ర్మిల‌. ఇప్పుడు 2.O సంస్కరణల పేరుతో తగ్గించింది రూ.2.5 లక్షల కోట్లు అన్నారు. ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన మోడీ...గోరంత ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధమ‌ని చెప్పారు. ఆత్మనిర్భరత, నవశకం, నవతరం అనేది అంతా బూటకం అని మండిప‌డ్డారు. ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదం నిప్పులు చెరిగారు. రేపటి కర్నూల్ సభకు 7వేల బస్సులట.... 5 లక్షల మంది జనసమీకరణ చేస్తార‌ట అంటూ మోడీ టూర్ పై కౌంట‌ర్ ఇచ్చారు. ప్రజల సొమ్ముతో మోడీ సొంత భజన చేయడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలని మండిప‌డ్డారు.

స్వల్పకాలిక GST పన్నుల సవరణతో ఏపీ ప్రజలకి తగ్గిన ట్యాక్సుల భారం రూ.8వేల కోట్లు మాత్రమేన‌ని తెలిపారు. ఇది ఎంతమాత్రం ప్రజలకు ఉపశమనం కాదన్నారు ష‌ర్మిల‌. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగాలంటే కావాల్సింది GST ఉత్సవాలు కాదు.. “ప్రత్యేక హోదా” అని ఫైర్ అయ్యారు. హోదానే రాష్ట్ర అభివృద్ధికి సంజీవని అన్నారు.

Next Story