సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం : షర్మిల

by velandi.Saikiran |   (  Updated:2025-06-23 13:25:28  IST  )

సింగయ్య మృతిపై ( Singaiah) మరోసారి వైఎస్ షర్మిల ( Ys Sharmila) స్పందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని (Ys Jagan) టార్గెట

సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: సింగయ్య మృతిపై ( Singaiah) మరోసారి వైఎస్ షర్మిల ( Ys Sharmila) స్పందించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని (Ys Jagan) టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు షర్మిల. వైసిపి కార్యకర్త సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణం అంటూ ఫైర్ అయ్యారు. క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమంటూ రెచ్చిపోయారు షర్మిల.

జగన్మోహన్ రెడ్డికి మానవత్వమే ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదని నిలదీశారు. మానవత్వం ఉంటే పరిహారం ఇచ్చి... క్షమాపణలు కోరాలని... చురకలంటించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డివి బల ప్రదర్శన... జన సమీకరణ కార్యక్రమాలు తప్ప... ఏ ఒక్కటి ప్రజల కోసం ఉండబోవని వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండని... జనాలను చంపకండి అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు షర్మిల. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ సంఘటనపై ఇవాళ వైయస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ పెట్టారు. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి... వైసిపి పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతికి కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణమని జగన్ ట్వీట్ చేశారు.

Next Story