- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ బొమ్మ తయారు చేసిన అభిమాని..మొత్తం ఆకులతోనే
ఆకులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ తయారు చేశాడు. ఈ బొమ్మ అచ్చం జగన్మోహన్ రెడ్డిని దింపినట్లే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జగన్ అంటే పడి చచ్చిపోతారు. టాలీవుడ్ హీరోకు కంటే ఎక్కువ క్రేజ్ జగన్ కు కూడా ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైనప్పటికీ, కూడా ఆయన అంటే ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తరహా నామునాను ఓ వ్యక్తి తయారు చేశాడు. ఆకులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ తయారు చేశాడు. ఈ బొమ్మ అచ్చం జగన్మోహన్ రెడ్డిని దింపినట్లే ఉంది. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి కలర్స్ వాడకుండా, కేవలం ఆకులతో మాత్రమే జగన్ ప్రతిబింబాన్ని నిర్మించాడు సదరు వ్యక్తి. ఇతడు కడపకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే, ఇది ఏఐ వీడియో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్






