- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్పటికీ అండగా ఉంటాం: గంగ పుత్రులకు వైఎస్ జగన్ హామీ
by Vemula.Srinu Prasad |
ఎప్పటికీ అండగా ఉంటామని గంగ పుత్రులకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న గంగ పుత్రులందరికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(వైస్ Jagan) ప్రపంచ మత్స్యకార దినోత్సవ(World Fisheries Day) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదర్భంగా తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. వివిధ పథకాల ద్వారా మత్స్యకారులకు రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం. గతంలోనే కాదు ఇప్పుడు, ఎప్పుడూ మత్స్యకారులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నా.’’ అని జగన్ ట్వీట్ చేశారు.
Next Story






