- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP:నేడు మరోసారి బెంగళూరు వెళ్లనున్న వైఎస్ జగన్!
by Jakkula.Mamatha |
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. గతవారమే బెంగళూరు పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న వైఎస్ జగన్..మళ్లీ నేడు(శుక్రవారం) అక్కడికే వెళ్లేందుకు సిద్ధమయ్యారని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు పయనం కాబోతున్నారు. కాగా మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరనున్న వైఎస్ జగన్ 4.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు పయనం అవుతారు. 6.40 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగనున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరులోని యలహంక నివాసానికి పయనం అవుతారని అధికారులకు సమాచారం అందించారు.
Next Story






