- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన..షెడ్యూల్ ఇదే
నేటి నుంచి రెండు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా దూసుకు వెళ్తున్నారు. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు రంగంలోకి నేరుగా దిగుతున్నారు జగన్. కూటమి వైఫల్యాలను ఎత్తి చూపిస్తూనే, పార్టీలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దుకుంటున్నారు. వైసీపీ నేతలు అరెస్ట్ అయితే, వారిని పరామర్శించేందుకు వెళ్లి.. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు జగన్. అలాంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి, నేటి నుంచి తన సొంత ఇలాక పులివెందులలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించబోతున్నారు. ఇవాళ పులివెందులకు చేరుకొని, క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ లో పాల్గొంటారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని, వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు. ఇక ఇవాళ రాత్రికి పులివెందులలోనే ఆయన నివాసంలో బస చేస్తారు జగన్.
ఈనెల 25వ తేదీన ఉదయం 9:30 గంటలకు పులివెందుల నుంచి వేంపల్లి మండలం నందిపల్లికి చేరుకుంటారు. అక్కడ కొత్తగా వెలిసిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో జగన్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా పాల్గొంటారు వైయస్ జగన్. ఇక మధ్యాహ్నం పులివెందుల తిరిగి చేరుకుంటారు. ఆ తర్వాత భాకరాపురం క్యాంపు ఆఫీసులో మరోసారి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక వైసీపీ నేతలతో సమావేశం కూడా ఉంటుంది. రేపు రాత్రికి అక్కడి నివాసంలో వైయస్ జగన్ బస చేస్తారు. ఇక ఆ తర్వాత నేరుగా బెంగళూరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.






