ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు: మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ సూటి ప్రశ్నలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-09 12:06:23  IST  )

పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు..

ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు: మెడికల్ కాలేజీల ఏర్పాటుపై జగన్ సూటి ప్రశ్నలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం(Narsipatnam)లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై ఆయన మండిపడ్డారు. పేదల ప్రజలకు ఆరోగ్యం బాగోలేకపోతే ఉత్తరాంధ్ర మొత్తంలో విశాఖ కేజీహెచ్(Visakhapatnam KGH) దిక్కుగా ఉందన్నారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము 17 కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నర్సీంపట్నంలోని మెడికల్ కాలేజీకి నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేస్తే పేదలకు మంచి జరుగుతుందన్నారు.

ఉత్తరాంధ్రలో బ్రిటీష్ వారు కట్టిన కేజీహెచ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ఓ ప్రభుత్వం మెడికల్ కాలేజీ మాత్రమే పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కాలేజీలకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసి నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యేవన్నారు. పేదలకు భవిష్యత్ లేని కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Next Story