రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-23 07:36:41  IST  )

రాజమండ్రిలో కల్తీపాలు తాగి నలుగురు మరణించడంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజమండ్రి కల్తీపాల ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో కల్తీపాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాలుతాగి నలుగురు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం విచారకరమని పేర్కొన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందన్నారు. ఈ ఘటనపై బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి అత్యుత్తమ వైద్యసేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.

ఆంధ్రా గడ్డపై కాలుపెడితే తొక్కిపడేస్తాం.. BRSకు మంత్రి వాసంశెట్టి స్ట్రైట్ వార్నింగ్

Next Story