YS Jagan:వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సాయం

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-13 10:25:58  IST  )

దేశ రక్షణే లక్ష్యంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దులో వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే

YS Jagan:వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సాయం
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ రక్షణ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సరిహద్దులో వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా వాసి జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఆదివారం స్వగ్రామం కల్లి తండాలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మురళీ నాయక్‌ను కడసారి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.

ఈ తరుణంలో.. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(మంగళవారం) శ్రీ సత్య సాయి జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తల్లిదండ్రుల కన్నీరు చూసి వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీర జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయిలకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మురళి నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తామని తెలిపారు. ఎంతోమందికి మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని జగన్(YS jagan) పేర్కొన్నారు. మురళి నాయక్ తల్లిదండ్రులకు అండగా ఉంటామని చెప్పారు.

Next Story