2026లో ప్రజలంతా సంతోషంగా ఉండాలి : వైఎస్ జగన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-31 14:13:41  IST  )

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

2026లో ప్రజలంతా సంతోషంగా ఉండాలి : వైఎస్ జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 2026 సంవత్సరం అందరి ఇళ్లలో ఆనందం నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రధాన నగరాలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యాయి. బాణసంచా పేల్చి, కేక్ కటింగ్స్ తో న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతో పాటు పల్లెలు సైతం న్యూ ఇయర్ శోభను సంతరించుకున్నాయి. విద్యుద్దీపకాంతులతో ప్రధాన రోడ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. న్యూ ఇయర్ ఈవెంట్లలో తాగి డ్రైవ్ చేయవద్దని పోలీసులు సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఎవరు పట్టుబడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story