టీటీడీ చైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

by Vemula.Srinu Prasad |

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రతోపాటు నిష్ఠగా చేయాల్సిన బాధ్యత అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.....

టీటీడీ చైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి(Venkateswara Swamy) కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల(Tirumala Tirupati Temple) నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రతోపాటు నిష్ఠగా చేయాల్సిన బాధ్యత అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) తెలిపారు. శాసనమండలిలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) అంశంపై చర్చ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేవారు. టీటీడీ ఛైర్మన్‌ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలని, కానీఈ పవిత్రమైన స్థానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని ఆయన విమర్శించారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారని, ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుకి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ తనను మోసం చేశారని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారని మండిపడ్డారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని నిలదీశారు. చంద్రబాబుకి భక్తి లేదని, శ్రద్ధ అంతకన్నా లేదని, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ...

‘‘లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్‌ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్‌ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది.’’ అని జగన్ తెలిపారు.

తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి...

ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిపై రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంతే. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ, ఇందాపూర్‌ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.’’ అని జగన్ విమర్శించారు.

Next Story