- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రవాస ఆంధ్రులను వెంటనే రప్పించండి: ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ జగన్
by Vemula.Srinu Prasad |
గల్ఫ్ దేశాల నుంచి ప్రవాస ఆంధ్రులను వెంటనే రప్పించాలని ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: గల్ఫ్ దేశాల(Gulf countries) నుంచి ప్రవాస ఆంధ్రుల(Andhra diaspora)ను వెంటనే రప్పించాలని ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minsiter Jagan Mohan Reddy) విజ్ఞప్తి చేశారు. ఇరాన్(Iran), ఇజ్రాయిల్ - అమెరికా(Israel-America) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథయంలో గల్ఫ్ దేశాలపై జరుగుతున్నదాడులపై ఆయన స్పందించారు. విమానాల నిలిపివేతతో గల్ఫ్ దేశాల్లో చాలా మంది ప్రవాస ఆంధ్రులు చిక్కుకుపోయారని, వారందరినీ త్వరగా రాష్ట్రానికి రప్పించాలని చెప్పారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా స్వరాష్ట్రానికి తరలించాలని కోరారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు సైతం ప్రకటించాలని వైఎస్ జగన్ తెలిపారు.
Next Story






