నేడు యువజన సంఘాలతో వైఎస్‌ జగన్‌ భేటీ

by Ajay Maddhiboyina |

వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు యువ‌జ‌న సంఘాల‌తో భేటీ కానున్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ త‌మ పార్టీ యువ‌జ‌న విభాగం ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అవుతారు.

నేడు యువజన సంఘాలతో వైఎస్‌ జగన్‌ భేటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు యువ‌జ‌న సంఘాల‌తో భేటీ కానున్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న్ త‌మ పార్టీ యువ‌జ‌న విభాగం ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అవుతారు. ఈ భేటీలో యువ‌జ‌న విభాగం రాష్ట్ర క‌మిటీ స‌భ్యులు, యువ‌జ‌న విభాగం జిల్లా, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అధ్య‌క్షులు పాల్గొంటారు. అంతే కాకుండా వైసీపీ ముఖ్య నాయ‌కులు సైతం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఓట‌మి త‌ర‌వాత జ‌గ‌న్ పార్టీ బ‌లోపేతం దిశ‌గా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ నేత‌లతో వరుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. చాలా మండి బీజేపీ, టీడీపీ వైపు చూస్తుండ‌టంతో క్యాడ‌ర్‌ను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story