- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతా వాళ్లే.. కల్తీ లిక్కర్ కేసుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
కల్తీ లిక్కర్ తయారీదారులు, అమ్మేవాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: కల్తీ లిక్కర్ తయారీదారులు, అమ్మేవాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ మనుషులే కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్పారు. లిక్కర్ తయారీ దారులు, సరఫరాదారులు, ప్రభుత్వం, పోలీసులూ వాళ్లేనని జగన్ మండిపడ్డారు. రాష్ర్టంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, వారిని కాదని ఇంకెవరైనా లిక్కర్ దందా నడిపే ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్నించారు. కల్తీ కేసుతో తమ పార్టీ జోగి రమేకు అసలు సంబంధమే లేదన్నారు. కల్తీ మద్యం తయారీ సూత్రదారుడు టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావరిది, పీఏ అని ఆరోపించారు. వాళ్లనెందుకు ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేకపోయారని నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ వాళ్లే నకిలీ మద్యం తయారు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అబద్ధపు వాంగ్మూలాలు, సాక్ష్యాలతో జోగి రమేశ్ ను అరెస్ట్ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి బ్రదర్స్ పైనే కాక యాక్టివ్‌గా ఉంటున్నారని జోగి రాజీవ్‌ను కూడా అరెస్ట్ చేశారని జగన్ ధ్వజమెత్తారు.






