- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లంతా చంద్రబాబు మనుషులే: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
నకిలీ మద్యం కేసు నిందితులంతా సీఎం చంద్రబాబు మనుషులేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం(Fake Liquor) ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) స్పందించారు. నకిలీ మద్యం వెనుక ఉన్న వాళ్లంతా సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మనుషులేనని వ్యాఖ్యానించారు. నిందితుడు జనార్ధన్ రావు(Janardhan Rao)తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
కాగా నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ రావు అరెస్టైన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. మరో నిందితుడు జయచంద్రారెడ్డి, తన మద్య ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్లు తెలిపారు. జయచంద్రారెడ్డి, తాను మద్యం వ్యాపారులమని చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే నకలీ మద్యం నడిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం వ్యాపారం మూసివేశామని తెలిపారు. కానీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఫోన్ చేసి మళ్లీ ప్రారంభించమని చెబితే ములకచెరువులో నకిలీ మద్యం తయారు చేశామని చెప్పారు. అంతేకాదు నకిలీ మద్యం తయారీపై కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నికలకు ముందే కుట్ర చేశారని జనార్ధన్ రావు తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలను జోగి రమేశ్ ఖండించారు. జయచంద్రారెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. కూటమి ప్రభుత్వమే నెపాన్ని తమపై నెడుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు జగన్ కూడా చేశారు. ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.






