Flash News : సింగయ్య మృతి కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్

by Naga Rani Yarlagadda |

సింగయ్య మృతి కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

Flash News : సింగయ్య మృతి కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగయ్య మృతి కేసులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. జగన్, వైసీపీ నేతలపై నమోదైన కేసుపై స్టే విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ 2 వారాల గడువు కోరడంతో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

జూన్ 18వ తేదీన జగన్ పల్నాడు జిల్లాలో పర్యటనకు వెళ్లగా.. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు ఆయనను రోడ్డుపక్కకు లాగి.. ఆస్పత్రికి తరలించకుండా అక్కడే వదిలేయడంతో కాసేపటికే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత సింగయ్య జగన్ కారు చక్రాల కింద నలిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఈ ఘటన కాస్తా సీరియస్ గా మారింది. అయితే అవి కుట్రపూరితంగా క్రియేట్ చేసిన వీడియోలని వైసీపీ నేతలు ఆరోపించడంతో.. పోలీసులు 6 ఫోన్ల నుంచి సేకరించిన వీడియోలను ఫోరెన్సిక్ విభాగానికి పంపి టెస్ట్ చేయించారు. అవి ఒరిజినల్ వీడియోలేనని, మార్ఫింగ్ కాదని తేలడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమయ్యారు.

Next Story