- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాశీబుగ్గ ఘటనపై వైయస్ జగన్ విచారం
శ్రీకాకుళం జల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనపై మాజీ సీఎం, వైకాపా అధినేత వైయస్ జగన్ (YS Jagan) స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనపై మాజీ సీఎం, వైకాపా అధినేత వైయస్ జగన్ (YS Jagan) స్పందించారు. దుర్ఘటనలో భక్తులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సమాచారం మేరకు 10 మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గతంలో కూడా దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. తిరుపతిలో (Tirupati) వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారన్నారు. అలాగే సింహాచలంలో (Simhachalam) జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారని పేర్కొన్నారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఇకనైనా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.






