- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: ఆత్మస్తుతి - పరనింద అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
ఆత్మస్తుతి - పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆత్మస్తుతి - పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లి (Thadepally)లో గవర్నర్ ప్రసంగం (Governor's Speech), వార్షిక బడ్జెట్ (Annual Budget)పై మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆ రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి - పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని అన్నారు. హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించింది బోడి సున్నా అని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్‌లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. రెండ్ బడ్జెట్లలో ప్రజలను సీఎం చంద్రబాబు (CM Chandrababu) మోసం చేశారని ధ్వజమెత్తారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటని అన్నారు.
సూపర్ సిక్స్ (Super Six) అంటూ ప్రగల్భాలు పలికి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి చెప్పారని ఆ లెక్కన 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద రూ.7,200 కోట్లు ఇవ్వాలని అన్నారు. కానీ, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి (Unemployment Benefit) కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఉన్న ఉద్యాగాలకు కూడా తీసేస్తున్నారనేది సత్యమని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.30లక్షల ఉగ్యోగాలు ఇచ్చామని అన్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించామని తెలిపారు. APCOS ద్వారా 96 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశామని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మొత్తం 6.31 లక్షల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పంచామని వైఎస్ జగన్ అన్నారు.






