- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింత కాదు.. వినూత్నం! పలమనేరులో 'యూట్యూబ్ ఫార్మేషన్ డే' వేడుకలు
సాంకేతిక విప్లవానికి చిహ్నమైన యూట్యూబ్‌కు కూడా ఒక దినోత్సవం నిర్వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. సాధారణంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు సబ్‌స్క్రైబర్లతో ముఖాముఖి సమావేశం, అభిమానుల మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ పలమనేరులో యూట్యూబ్ ఫార్మేషన్ డే పేరుతో వినూత్నంగా డిజిటల్ క్రియేటర్ల కోసం వేడుకలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : చిత్తూరు - తిరుపతి ఉమ్మడి జిల్లాలలో ఎక్కడలేని విధంగా, పలమనేరు పట్టణంలో ‘యూట్యూబ్ ఫార్మేషన్ డే’వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంకేతిక విప్లవానికి చిహ్నమైన యూట్యూబ్‌కు కూడా ఒక దినోత్సవం నిర్వహించడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. సాధారణంగా ఇన్‌ఫ్లూయెన్సర్లు సబ్‌స్క్రైబర్లతో ముఖాముఖి సమావేశం, అభిమానుల మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ పలమనేరులో యూట్యూబ్ ఫార్మేషన్ డే పేరుతో వినూత్నంగా డిజిటల్ క్రియేటర్ల కోసం వేడుకలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. సమాచార విప్లవంలో భాగమైన డిజిటల్ క్రియేటర్లను గౌరవించుకోవాలనే ఈ ఆలోచన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పలమనేరు యూట్యూబర్ల ఉత్సాహం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని వినూత్న వేడుకలకు వేదికయ్యేలా కనిపిస్తోంది.
హోరెత్తిన బైక్ ర్యాలీ..
గంటావూరు గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక యూట్యూబ్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ వీధుల్లో యూట్యూబ్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరి సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని పండుగ వాతావరణాన్ని తలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ.. ‘ఒక ఏడాది క్రితం వరకు నేను ఎవరో పలమనేరులో చాలా మందికి తెలియదు. కానీ నేడు యూట్యూబ్ సోదరుల వల్ల ప్రజలు నన్ను గుర్తిస్తున్నారు. నాకు గుర్తింపు తెచ్చిన ప్రతి యూట్యూబ్ ఛానల్ మిత్రుడికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.
సామాన్యుడి ఆయుధం.. యూట్యూబ్!
పలమనేరు యూట్యూబ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర, సభ్యులు ఈ వేదికపై యూట్యూబ్ ప్రాముఖ్యతను వివరించారు. వార్తలను ప్రజల వద్దకు చేర్చడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోందని, నైపుణ్యం ఉన్న ఎంతోమందిని ఇది ప్రపంచానికి పరిచయం చేస్తోందని తెలిపారు. కేవలం వినోదమే కాకుండా, విద్య, ఎంతోమంది నిరుద్యోగులకు ఇది ఒక ఉపాధి మార్గంగా మారిందన్నారు. యూట్యూబర్లను గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు ఈ వేడుకను నిర్వహించిన డాక్టర్ మురుగన్‌కు అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 14, 2005న చాడ్ హర్లీ, జావేద్ కరీం, స్టీవ్ చెన్ కలిసి దిగ్గజ ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ YouTubeను స్థాపించిన విషయం తెలిసిందే.






