- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర పునర్నిర్మాణంలో యువశక్తిది కీలక పాత్ర : సీఎం
భారత సంస్కృతి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన వివేకానందుడి జయంతి నేడు.

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ యువజన దినోత్సవం (National Youth Day) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) రాష్ట్ర యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద (Swamy Vivekananda) జయంతిని పురస్కరించుకుని ఆయన ఆ మహనీయుని ఆశయాలను స్మరించుకుంటూ, యువతే దేశానికి అసలైన బలమని ఎక్స్ వేదికగా కొనియాడారు. వివేకానందుని జీవితం యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సేవాభావాన్ని నింపుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతపై అపారమైన నమ్మకాన్ని ఉంచిన స్వామిజీ, క్రమశిక్షణ, ఐక్యతతో దేశం కోసం, మానవత్వం కోసం నిస్వార్థంగా పనిచేయాలని ప్రభోదించారని సీఎం గుర్తుచేశారు.
యువత తమ శీలాన్ని నిర్మించుకోవాలని, జ్ఞానాన్ని సముపార్జించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువశక్తిది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపనలో యువతీ యువకులు ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సోషల్ మీడియా వంటి ఆధునిక సాంకేతికతను యువత తమ వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదల కోసం సానుకూలంగా ఉపయోగించుకోవాలని సూచించారు. యువత గమ్యాన్ని నిర్దేశించుకుంటే, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్ వేదిగా ప్రకటించారు.
యువతకు ఆదర్శప్రాయుడు : మంత్రి లోకేశ్
సనాతన ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువతకు ఆదర్శప్రాయుడైన ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. తన ప్రసంగాలతో నవతరానికి దిశానిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణం కోసం పరితపించారని, లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.






