విజయవాడలో థార్ జీప్ ఫైట్.. అమ్మాయికోసం నడిరోడ్డుపై బీభత్సం

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ‌లో గురువారం రాత్రి హైడ్రామా జ‌రిగింది. 100 అడుగుల రోడ్డులో ఓ యువ‌తి కోసం ఇద్ద‌రు థార్ జీపుల‌తో ఒక‌రినొక‌రు ఢీ కొట్టుకుంటూ బీభ‌త్సం సృష్టించారు.

విజయవాడలో థార్ జీప్ ఫైట్.. అమ్మాయికోసం నడిరోడ్డుపై బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ‌లో గురువారం రాత్రి హైడ్రామా జ‌రిగింది. 100 అడుగుల రోడ్డులో ఓ యువ‌తి కోసం ఇద్ద‌రు థార్ జీపుల‌తో ఒక‌రినొక‌రు ఢీ కొట్టుకుంటూ బీభ‌త్సం సృష్టించారు. న‌డిరోడ్డుపై జీపుల‌తో ఢీ కొట్టుకోవ‌డంతో స్థానికులు భయాందోళ‌న చెందారు. యువ‌కులు ఇద్ద‌రూ ఓ అమ్మాయి కోసం గొడ‌వ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రూ జీపుల‌తో ఢీకొట్టుకునే స‌మ‌యంలోనూ ఆ అమ్మాయి ఓ జీపులో కూర్చుని ఉంది. కొద్దిసేపు జీపులతో ఢీ కొట్టుకున్న త‌ర‌వాత జీపు నుండి దిగి ఇనుప రాడ్ల‌తో కారు అద్దాలు ధ్వంసం చేశారు. యువ‌కులు ఇద్ద‌రు బొల్లా ఓం, లింగ‌మ‌నేని రోహిత్‌గా తెలుస్తోంది. ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో లింగ‌మ‌నేని రోహిత్ జీప్ టైర్ పంక్చ‌ర్ అవ్వ‌డంతో అక్క‌డ నుండి పారిపోయాడు.

అత‌డి జీపు అద్దాల‌ను బొల్లా ఓం ధ్వంసం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకుని బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరు యవకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బొల్లా ఓంను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ అనే యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక నడిరోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లలా వ్యవహరిస్తూ దాడి చేసుకోవడంపై భయాందోళన చెందుతున్నారు. ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని, ఇలాంటివారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంటున్నారు.

Next Story