- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విచిత్రం.. మేకను పెళ్లి చేసుకున్న యువకుడు.. గుడిలో తాళి కట్టి...
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా.. ఏదో ఒక చోట మూఢ న

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నా.. ఏదో ఒక చోట మూఢ నమ్మకాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో జనాలు వింత పోకడలకు పోతున్నారు. ఓ జ్యోతిష్యుడి సూచనతో దోష నివారణ కోసం యువకుడికి మేకతో పెళ్లి జరిపించిన విచిత్ర ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.నూజివీడుకు చెందిన ఓ యువకుడికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇందులో భాగంగా అతడి జాతకాన్ని పరిశీలించేందుకు ఓ జోతిష్యుడిని సంప్రదించారు. యువకుడి జాతకాన్ని చూసిన ఆ జ్యోతిష్యుడు జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడని తెలిపాడు . ఆ దోషం తొలగిపోవాలంటే మేకతో వివాహం జరిపించాలని తల్లిదండ్రులకు సూచించాడు
దీంతో తల్లిదండ్రులు ఆ యువకుడికి మేకతో వివాహం జరిపించారు. నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో మేకతో పెళ్లి జరిపించారు. ఉగాది రోజున అర్చకులు యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు. మేకతో మొదటి వివాహం అయిపోయింది కాబట్టి.. ఇక పెళ్లి చేసుకున్నా ఇబ్బంది ఉండదని యువకుడు భావిస్తున్నాడు. ఇది చూసిన స్థానికులు మేకతో పెళ్లి ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారు.






