Home Minister Anita:‘మా నాన్న కష్టాన్ని గుర్తు చేశావ్ తల్లి’.. హోంమంత్రి అనిత ఎమోషనల్ ట్వీట్

by Jakkula Mamatha |   ( Updated:2024-11-07 09:15:30.0  )
Home Minister Anita:‘మా నాన్న కష్టాన్ని గుర్తు చేశావ్ తల్లి’.. హోంమంత్రి అనిత ఎమోషనల్ ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET) ఫలితాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో విజయనగరానికి చెందిన కొండ్రు అశ్విని వంద శాతం రిజల్ట్స్ సాధించింది. ఈ విషయం పై హోంమంత్రి అనిత(Home Minister Anita) తాజాగా స్పందించారు. ఏపీ టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించిన కొండ్రు అశ్వినికి హోం మంత్రి అనిత అభినందనలు తెలిపారు. ‘ఆర్థిక స్తోమత లేకున్నా చదువు మాత్రమే ప్రయోజకుల్ని చేయగలదని నమ్మి ప్రభుత్వ విద్యాలయంలో అశ్విని చదివారు. ఆటో నడుపూతూనే ఆడపిల్లని చదివించిన తండ్రి శంకరరావు, వెంకటలక్ష్మి దంపతులకు శుభాభినందనలు అని హోం మంత్రి అనిత తెలిపారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా నాన్నగారి కష్టాన్ని గుర్తు చేశావు’ తల్లీ అని అనిత ఉద్వేగభరిత ట్వీట్ చేశారు.


Read More..

Home Minister Anitha:మాజీ మంత్రి అంబటి రాంబాబుకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed