- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా బలం.. నా ప్రశాంతత నీవే : నారా బ్రాహ్మణి
నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు.

దిశ, వెబ్ డెస్క్ : నేడు ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పుట్టిన రోజు (Birthday). మంత్రి లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి (Nara Brahmani) సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్ట్ ను చేశారు. "నా బలం.. నా ప్రశాంతత నీవే! లోకేశ్ మీరు ప్రజల కోసం పడుతున్న శ్రమను, నిశ్శబ్దంగా మోస్తున్న త్యాగాలను నేను నిరంతరం గమనిస్తున్నాను. సమాజంలో మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ బిజీ జీవితంలో ఈ ఏడాది మీకు కాస్త ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాను. మీ పక్కన నడవడానికి నేను ఎప్పుడూ గర్వపడతాను" అంటూ ఆమె తన ప్రేమను వ్యక్తపరిచారు. భర్తపై ఆమె చూపిన ఈ అనురాగం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అభిమానులు తమ అభిమాన నాయకుడికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.






