- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగి వేమన నీతి సూత్రాలు అనుసరణీయం : సీఎం
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైననేమి ఖరము పాలు.

దిశ, వెబ్ డెస్క్ : విశ్వదాభిరామ వినురవేమా అంటూ యోగి వేమన (Yogi Vemana) చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయమైనవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. వేమన జయంతిని పురస్కరించుకొని ఆయనకు సీఎం ఘన నివాళులు అర్పించారు. వేమన గొప్ప తనాన్ని పొగుడుతూ ఎక్స్ (x.com) వేదికగా తన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. ప్రజాకవి, సామాజిక సంఘ సంస్కర్తగా యోగి వేమన గుర్తింపు పొందారన్నారు. సమాజంలో బేధభావాలను తగ్గించేందుకు కృషి చేశారన్నారు. కులమత బేధాలు, మూఢ నమ్మకాలను రూపు మాపేందుకు తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. ఆయన రాసిన వేమన శతకం నేటికి కూడా సంబద్ధమైనదని, ఆచరించదగినదని, వాస్తవాలను కళ్లకు కడుతుందని వివరించారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం నిజంగా గొప్పవిషయంగా పేర్కొన్నారు. వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అటువంటి మహనీయుడి జయంతిని నిర్వహించుకోవడం అంటే మనల్ని మనం సన్మార్గంలో నడిపించుకోవడమేనని అన్నారు.






