Yogandhra : యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్.. చంద్రబాబును అభినందించిన మోడీ

by Muthe.Rajitha |

అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా నిన్న ఏపీలో జరిగిన యోగాంధ్ర(Yogandhra) గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కింది.

Yogandhra : యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్.. చంద్రబాబును అభినందించిన మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా నిన్న ఏపీలో జరిగిన యోగాంధ్ర(Yogandhra) గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్(Guinness Book of World Records) ప్రతినిధులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. కాగా దీనిపై ప్రధాని మోడీ(PM Narendra Modi) X వేదికగా స్పందించారు. వైజాగ్ లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక్కతాటిపై నిలిపింది. 3 లక్షల మందితో ఒకేసారి యోగా చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకున్న ఏపీ ప్రజలకు, సీఎం చంద్రబాబు నాయుడుకు నా ప్రత్యేక అభినందనలు అన్నారు.

దీనిపై ఏపీ చంద్రబాబు(CM Chandrababu Naidu) స్పందిస్తూ.. అతర్జాతీయ యోగా డే రోజు ఏపీ సాధించిన ఈ ఘన విజయం, ప్రపంచ రికార్డు ప్రతి ఒక్కరిది అన్నారు. ఈ అద్భుత ఘనతను సాధ్యం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యోగాంధ్ర వరల్డ్ రికార్డులో భాగస్వామ్యం అయిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు.

Next Story