International Yoga Day:రాష్ట్ర సచివాలయంలో ఘనంగా యోగా వేడుకలు

by Jakkula.Mamatha |

రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

International Yoga Day:రాష్ట్ర సచివాలయంలో ఘనంగా యోగా వేడుకలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సచివాలయ ప్రాంగణంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. బి.రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణతో పాటు సచివాలయ ఉద్యోగులు అంతా పెద్ద ఎత్తున పాల్గొని యోగా మాస్టర్స్ సూచనల మేరకు పలు రకాల యోగాసనాలు అభ్యసించారు.

రాష్ట్ర సచివాలయ ప్రాగణంలోని సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉదయం 6.30 గంటలకే చేరుకుని పలు రకాల యోగాసనాలను దాదాపు ఒక గంటపాటు అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పలు రకాల యోగాసనాలు అభ్యసిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ సమ్మేళనానికి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా నిర్వహించిన ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story