Breaking: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 41-ఏ నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-12 07:01:30  IST  )

మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు జారీ చేశారు...

Breaking: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 41-ఏ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Former Minister Chevireddy Bhaskar Reddy)కి ఎర్రగొండపాలెం పోలీసులు(Yerragondapalem Police) నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై గతంలో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బుధవారం ఉదయం నోటీసులు జారీ చేశారు.

కాగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరినట్లు తెలుస్తోంది. మరి విచారణకు హాజరవుతారా, లేదా అనేది చూడాల్సి ఉంది.

Next Story