తిరుపతిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు: మంత్రి అనగాని సత్యప్రసాద్

by Yella Dhawani Reddy |

ప్రశాంతమైన తిరుపతిలో (Tirupati) రౌడీయిజం ఎక్కువవుతుందని, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Sathyaprasad) మండిపడ్డారు.

తిరుపతిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు: మంత్రి అనగాని సత్యప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రశాంతమైన తిరుపతిలో (Tirupati) రౌడీయిజం ఎక్కువవుతుందని, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Sathyaprasad) మండిపడ్డారు. బైక్‌ను అద్దెకు తీసుకుని డబ్బులు ఇవ్వలేదని పవన్ అనే యువకుడిని వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, భూమన అభినయ్ అనుచరులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం పవన్‌ ఆచూకీ తెలియటం లేదని, అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని చెప్పారు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, దాడికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని శిక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు తెలిపారు.

Next Story