- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayasai Reddy: పెండింగ్ డిమాండ్ నెరవేరింది.. థాంక్యూ మోడీజీ
by Vemula.Srinu Prasad |
ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు....

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వందే భారత్ రైలును ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ నేడు నెరవేరిందని అన్నారు. ఈ రైలు అంశాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పదేపదే ప్రస్తావిస్తూ వస్తున్నారని చెప్పారు. శ్రీవారి భక్తులకు ఈ వందేభారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుందని అయితే వందే భారత్ రైలుతో ఆ ప్రయాణం కాస్త ఎనిమిదిన్నర గంటలకు తగ్గుతుందని, ఇది ప్రయాణికులకుఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతో తోడ్పాటునందిస్తుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story






