ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరతపై నిరసన తెలియజేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టారు.

ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు
X

యూరియా కొరతపై అన్నదాత పోరు పేరిట ఆందోళనలు

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరతపై నిరసన తెలియజేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల దగ్గర నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్ర మాలు. రైతులు, రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేశారు. ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు

Next Story