- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పారంటే - చేస్తారంతే.. సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైన చెబితే దాన్ని చేసి తీరుతారని వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైన చెబితే దాన్ని చేసి తీరుతారని వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తూ ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం పట్ల విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చెప్పారంటే - చేస్తారంతే అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 25 ఏళ్ల కల వైఎస్ జగన్ హయాంలో సాకారమైందని చెప్పుకొచ్చారు. 4,534 మంది 1998డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వారంతా టీచర్లుగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story






