Yuvagalam Lokesh పాదయాత్రపై Vijaya Sai Reddy సెటైర్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-01-27 06:25:50  IST  )

టీడీపీ నేత యువనేత లోకేష్ జనం గొంతుగా మారాలంటే తండ్రి చంద్రబాబు మద్దతు సరిపోదని, ప్రజల విశ్వాసం పొందాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు...

Yuvagalam Lokesh పాదయాత్రపై Vijaya Sai Reddy సెటైర్లు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత యువనేత లోకేష్ జనం గొంతుగా మారాలంటే తండ్రి చంద్రబాబు మద్దతు సరిపోదని, ప్రజల విశ్వాసం పొందాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలో 44 నెలలుగా జనరంజక పాలన సాగుతుందన్నారు. వైసీపీ అసాధ్యమనుకున్న ఎన్నో ప్రజాహిత చర్యలను సుసాధ్యం చేస్తోందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలూ గరిష్ఠ సంతృప్త స్థాయిలో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే, 2019లో ప్రజలు తిరస్కరించిన తెలుగుదేశం నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని విమర్శించారు. రాజకీయ చౌరస్తాలో నిలబడి గమ్యం కనబడని దిశగా అడుగులేస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే, ఎలాగైనా ప్రజలకు వరసగా కొన్ని వారాలు కనపడడానికి లోకేష్ పాదయాత్రకు దిగుతున్నాని విమర్శించారు. అసలు సమస్యలే లేని రాష్ట్రంలో వాటి పరిష్కారానికి సారథి అవుతానని లోకేశ్‌ హామీ ఇచ్చాడా అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి: Nara lokesh అలా చేస్తే.. తిరుగులేని శక్తిగా టీడీపీ!

Next Story