VijayasaiReddy: అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా

by Disha Web Desk 16 |
VijayasaiReddy: అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా 2023లో అవతరిస్తుందని ఆర్దిక నిపుణులు అంచనా వేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ప్రపంచ స్థూల వస్తు సేవల ఉత్పత్తిలో (జీడీపీ) ఇండియా వాటా 32 శాతం అని ఆర్థిక చరిత్రకారులు అంచనావేశారని తెలిపారు. గత పదేళ్లలో భారతదేశ వినియోగదారుల మార్కెట్‌ సైజు దాదాపు రెట్టింపు అయి 2.1 లక్షల కోట్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుందన్నారు.

ప్రపంచంలో పదో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌ స్థాయి నుంచి నేడు ఇండియా నాలుగో అతిపెద్ద వినియోగదారుల విపణి అయిందిని వెల్లడించారు. భారత దేశ జనాభాలో 26 కోట్ల మంది సంపన్నులు అత్యంత సంపన్న అగ్రరాజ్యం అమెరికా జీవనశైలిని అనుసరించే ఆర్థిక సామర్ధ్యం సంపాదించారని. ఈ లెక్కన భారత స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలు జరిగే 2047 నాటికి ఇండియాకు అనేకానేక అవకాశాలతోపాటు ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని ముందుకు సాగడానికి అవసరమైన సామర్ధ్యం సమకూర్చుకోవాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు



Next Story