పవన్ కల్యాణ్ మోసం చేశారు.. పోరాటం చేస్తాం: వరుదు కళ్యాణి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-13 11:14:32  IST  )

కాపు మహిళలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోసం చేశారని, సూపర్ సిక్స్అమలు చేసే వరకు తాము పోరాటం చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు..

పవన్ కల్యాణ్ మోసం చేశారు.. పోరాటం చేస్తాం: వరుదు కళ్యాణి
X

దిశ, వెబ్ డెస్క్: కాపు మహిళలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) మోసం చేశారని, సూపర్ సిక్స్(Super Six) అమలు చేసే వరకు తాము పోరాటం చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Ycp Mlc Varudu Kalyani) హెచ్చరించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం(Tadepally Ycp Office)లో మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. అంతేకాదు సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌(Minsiter Nara Lokesh)పై విమర్శల వర్షం కురిపించారు. ఆడబిడ్డ నిధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. 2 కోట్ల మంది మహిళలకు ఆయన వెన్నుపోటు పొడిచారని వరుదు కల్యాణి ఆరోపించారు.

తిరుపతి సభకు విజయోత్సవ సభకు బదులుగా వెన్నుపోటు సభ అని పేరు పెడితే బాగుండేదని వరుదు కల్యాణి విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన వరదు కల్యాణి తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టారని చెప్పారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమైందని ప్రశ్నించారు. CBN అంటే చీటింగ్ బోగఎస్ నాయుడు అని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలు ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ అమలు చేశామని చెప్పాలన్నారు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని పవన్ కల్యాణ్ చెప్పారని, మంత్రి లోకేశ్‌ను సైతం గల్లా పట్టుకొని నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.

Next Story