- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్యాయం జరిగింది కాబట్టే ఎమ్మెల్సీకి రాజీనామా: మర్రి రాజశేఖర్
అన్యాయం జరిగింది కాబట్టే ఎమ్మెల్సీకి రాజీనామా: మర్రి రాజశేఖర్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్(MLC Marri Rajasekhar) మీడియాతో మాట్లాడారు. 2025 మార్చి 19వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఎవరి బలవంతం లేదు.. స్వచ్ఛందంగానే రాజీనామా చేశాను. ఎవరికీ కారణాలు చెప్పాలనుకోవడం లేదు.. చెప్పను కూడా. నాకు వైసీపీలో అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఐదేళ్లుగా ఓర్చుకుని ఓర్చుకుని పనిచేశాను. అయినా గుర్తించడం లేదు. నా రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయన నిర్ణయం తర్వాత నా కార్యచరణ ప్రకటిస్తాను’ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ స్పష్టం చేశారు. కాగా, మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీ (TDP) గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీనామాకు సిద్ధమైన రాజశేఖర్‌ను వైసీపీ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని బొత్స సత్యనారాయణ వంటి నేతలు కోరారు. అయితే తాను నిర్ణయం తీసేసుకున్నట్లు రాజశేఖర్ తేల్చిచెప్పేశారు. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.






