- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలతో అసభ్యకరంగా డ్యాన్సులు.. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వీడియోలు వైరల్
ఓ విడాకుల కేసు విషయంలో సలహా తీసుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేష్ శర్మపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదవ్వగా ప్రస్తుతం ఆయనకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఓ విడాకుల కేసు విషయంలో సలహా తీసుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది వెంకటేష్ శర్మపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదవ్వగా ప్రస్తుతం ఆయనకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో వెంకటేష్ శర్మ యువతులపై డబ్బులు విసురుతూ డ్యాన్సులు చేస్తున్నాడు. గదిలో వెంకటేష్ వర్మతో పాటు మరికొందరు సైతం ఉన్నారు.
యువతులు చూసేందుకు విదేశీయుల్లో కనిపిస్తున్నారు. ఇక మరో వీడియోలో వెంకటేష్ శర్మ బెడ్ పై పడుకుని తనపై నోట్ల కట్టలను పెట్టుకున్నారు. అంతే కాకుండా తలపై నోట్ల కట్టలను పెట్టుకుని డ్యాన్సులు చేశారు. వెంకటేష్ శర్మపై కేసు నమోదవ్వడంతో ఆయన వైరల్ వీడియోలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక నెట్టింట వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం వెంకటేష్ శర్మ తీరుపై మండిపడుతున్నారు. ఓ న్యాయవాది అయ్యుండి ఇటాంటి పనులు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. video






