- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయిరెడ్డి రాజీనామాపై YCP అధిష్టానం స్పందన
వైసీపీ(YCP) కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామాపై ఆ పార్టీ అధిష్టానం స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామాపై ఆ పార్టీ అధిష్టానం స్పందించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టింది. విజయసాయి నిర్ణయాన్ని తాము ఆమోదించకపోయినా.. గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి విజయసాయి పునాదిలా ఉన్నారని అన్నారు. విజయాలు వచ్చినప్పుడే కాకుండా.. అపజయాల్లోనూ అండగా, బలంగా నిలబడ్డారని కొనియాడారు. తాను ఎంచుకున్న దారిలో తప్పకుండా విజయం సాధించాలని శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ పెట్టారు. ఇదిలా ఉండగా.. విజయసాయి రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్(Rajya Sabha Chairman Jagdeep Dhankar) ఆయన రాజీనామాను ఆమోదిస్తూ శనివారం బులిటెన్ విడుదల చేశారు.
"Even though we do not approve your decision, we still respect your choice. You’ve been one of the pillars of strength for our party since its inception, standing with us through both tough times and triumphs. We respect your decision to step away from politics to pursue your… https://t.co/NCoaEYxCEq
— YSR Congress Party (@YSRCParty) January 25, 2025






