- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల ఆరోపణలు
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలను గుప్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలను గుప్పించారు. కూటమి పాలనలో ధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించగా, ఇళ్ల నిర్మాణంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ధార్మిక సంస్థలపై దాడులు
కూటమి ప్రభుత్వ పాలనలో ధార్మిక సంస్థలపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (Malladi Vishnu) ఆరోపించారు. హిందువుల మనోభావాలతో రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించరు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణిలో చోరీ కేసులతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేవలం వైసీపీపై బుదరజల్లెందుకు ప్రభుత్వంలోని కొందరు పని గట్టుకొని దేవాలయాలను మాధ్యమాలుగా వాడుకోవడాన్ని తప్పుబట్టారు. ధార్మిక కేంద్రాలను రాజకీయాలకు ఆయుధాలుగా వాడుకోవద్దన్నారు. ప్రఖ్యాతి గాంచిన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేవాలయానికి ఆదాయం వస్తున్నా ఇటువంటి పరిస్థితి నెలకోవడం పట్ల విస్మయానికి గురయ్యారు. శింగనమల వంటి ప్రాంతాల్లో అర్చకులు దేవాలయాన్ని రక్షించుకోవడానికి ధర్నాకు దిగే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందన్నారు. హిందువులకు అన్యాయం చేస్తున్నవారు హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో వైసీపీ విమర్శించే అర్హత కలిగి ఉండరని స్పష్టం చేశారు.
పేదల ఇళ్ళపై దుష్ప్రచారం
పేదల ఇళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ఆరోపించారు. వైసీపీ హయాంలో కట్టిన ఇళ్ళను కూటమి ప్రభుత్వ హయాంలో నిర్మించామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. అమరావతిలో ప్యాలెస్ కట్టుకునే ఆలోచన తప్ప పేదల ఇళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే అనుమానాలున్నాయని.. వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు రప్పా రప్పా అంటే జైలుకు పంపిస్తున్నారని.. టీడీపీ శ్రేణులు చేసిన దాడులపై చర్యలెందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జైళ్లు, కేసులకు వైసీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ప్రకటించారు.






