- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
32వేల మంది మహిళలు మిస్సింగ్ అన్న పవన్ ఎందుకు మాట్లాడట్లేదు: వైసీపీ నేత శ్యామల ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు 32వేల మంది మహిళలో ఏపీలో మిస్ అయ్యారని చెప్పిన పిఠాపురం

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు 32వేల మంది మహిళలో ఏపీలో మిస్ అయ్యారని చెప్పిన పిఠాపురం పిఠాధిపతి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయన ఎంతో గోల పెట్టారని గెలిచిన తరవాత ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే మహిళలకు అన్యాయం జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడటం లేదని మండిపడ్డారు.
మాజీ మంత్రిగా చేసిన విడదల రజినిపైనే పోలీసులు అసభ్యంగా మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం వాళ్లు ఒక్కరు కూడా స్పందించలేదని అన్నారు. మాజీ మంత్రిగా చేసిన మహిళకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. అంతే కాకుండా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టులను తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దొంగ సాక్ష్యాలు, తప్పుడు స్టేట్మెంట్లతో ఈ అరెస్ట్ జరిగిందని మండిపడ్డారు. కూటమి సర్కార్ కక్ష్య సాధింపు చర్యల్లో బిజీగా ఉందని మండిపడ్డారు.






