మాకు రెడ్ బుక్ అవసరం లేదు..మరోసారి ప్రసన్నకుమార్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

వైసీపీ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి మ‌రోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు స‌రిపోవ‌ని వ్యాఖ్యానించారు.

మాకు రెడ్ బుక్ అవసరం లేదు..మరోసారి ప్రసన్నకుమార్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి మ‌రోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు స‌రిపోవ‌ని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు స‌హ‌జం అని అన్నారు. నేను పీజీ చేశా అంటూ ప్ర‌శాంతి రెడ్డి మాట్లాడారు, నేను కూడా ఆమె పీహెచ్‌డీ చేసిందని మాత్రమే అన్నానని చెప్పారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని అన్నారు. తాను మాట్లాడుతున్నప్పుడు నవ్వాడని అనిల్ కుమార్ యాదవ్ పై కూడా కేసు పెట్టడం హాస్యాస్పదం అని అన్నారు.

కేసులు పెట్టడం తమ సంప్రదాయం కాదని, తమకు రెడ్ బుక్ అవసరం లేదని అన్నారు. మైండ్‌లోనే ఎవరెవరు ఏంటి అన్నది గుర్తుపెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ ఇళ్లపై దాడులు చేసే రాజకీయాలు లేవని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. అదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

Next Story