పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాకాణి ఆందోళన.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

వైసీపీ కార్యకర్త హరికృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళనకు దిగారు...

పొదలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాకాణి ఆందోళన.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) కార్యకర్త హరికృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పోలీస్ స్టేషన్(Podalkuru Police Station) ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) , వైయస్ఆర్ సీపీ(Ysrcp) నేతల ఆందోళనకు దిగారు. పొదలకూరు ఎస్సై హనీఫ్‌(Podalakur SI Hanif)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించారు. స్టేషన్ ఎదుట భారీగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు గుమిగూడారు.

పోలీసులు కొడితే తిరగబడండి: కాకాణి పిలుపు

ఈ సందర్బంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూవైసీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెదిరింపులకు పాల్పడుతూ, స్టేషన్‌కి పిలిచి కొడుతున్నారని ఆరోపించారు. కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడని వ్యాఖ్యానించారు . మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొట్టాడని, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ రూ. 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించామని చెప్పారు. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయని.. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని ఎస్సై బెదిరిస్తాడా..?, అకారణంగా పోలీసులు కొడితే తిరగబడాలని కాకాణి పిలుపునిచ్చారు.

Next Story