Ap: వైసీపీ కీలక నేత సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-08 17:15:00  IST  )

నెల్లూరు నియోజకవర్గం కావలిలో వైసీపీ కీలక నేతను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది...

Ap: వైసీపీ కీలక నేత సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలి(Kavali) నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కావలి మాజీ ఏఎంజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి(Former AMG Chairman Mannemala Sukumar Reddy of Kavali)పై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని పార్టీ క్రమ శిక్షణ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయయను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్రం కార్యాలయం ప్రకటించింది. సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ లేఖను విడుదల చేసింది. దీంతో ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు కావలిలో వైసీపీ నాయకులు సైలెంట్ అయ్యారు. ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. విద్యుత్ ఛార్జిల పెంపుపై చేపట్టిన నిరసనలోనూ పార్టీ కీలక నాయకులు పాల్గొనలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ రెడ్డి పార్టీలో క్రమ శిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.

Next Story