వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందాం.. వైసీపీ మాజీ MLA కీలకవ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాము తప్పుచేశామ‌ని అన్నారు. గత ఎన్నికల్లో BJPతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందాం.. వైసీపీ మాజీ MLA కీలకవ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ MLA ప్రసన్నకుమార్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తాము తప్పుచేశామ‌ని అన్నారు. గత ఎన్నికల్లో BJPతో పొత్తు పెట్టుకుంటే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు. పార్లమెంటులో NDAతెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతిచ్చామని, గత ఐదేళ్లలో మోదీ ఏం చెబితే అది చేశామ‌న్నారు. కానీ చివరకు బీజేపీకి దూరమయ్యాం.. నష్టపోయాం అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందామ‌ని ఇది త‌న అభిప్రాయం అని అన్నారు. కానీ తుదినిర్ణయం జగన్‌దే అని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేంద్రంలో మోడీ స‌ర్కార్ తో ఎలాంటి విభేదాలు లేకుండా క‌లిసి ప‌నిచేసింది. పార్ల‌మెంట్ లో కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తి బిల్లుకు ఆమోదం తెలిపింది. కానీ ఏపీలో టీడీపీ గెలిచే సూచ‌న‌లు ఉండ‌టం, వైసీపీపై వ్య‌తిరేక‌త క‌నిపించ‌డంతో బీజేపీ టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి పోటీచేసింది. దీంతో అక్క‌డ కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చింది.

Next Story