ఫిష్ వెంకట్ హెల్త్...బాలయ్యకు జై కొట్టిన వైసీపీ ఫ్యాన్స్...!

by velandi.Saikiran |

బాలయ్య ( Balayya) అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది వైసీపీ (YCP) సోషల్ మీడియా బృందం. అదేంటి బద్ధ శత్రువైన

ఫిష్ వెంకట్ హెల్త్...బాలయ్యకు జై కొట్టిన వైసీపీ ఫ్యాన్స్...!
X

దిశ, వెబ్ డెస్క్: బాలయ్య ( Balayya) అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది వైసీపీ (YCP) సోషల్ మీడియా బృందం. అదేంటి బద్ధ శత్రువైన బాలయ్య, ఆయన అభిమానులకు వైసీపీ కార్యకర్తలు థాంక్స్ చెప్పడం ఏంటని అనుకుంటున్నారా..? మంచి ఎవరు చేసినా.. మంచే కదా.. ! అప్పుడప్పుడు మెచ్చుకోవాల్సి వస్తుంది. తాజాగా ఫిష్ వెంకట్ ( Fish Venkat).. అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అతనికి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు కూడా విడుదల చేశారు. అయినప్పటికీ టాలీవుడ్ పెద్దలు ఎవరు స్పందించడం లేదు.

కొంత మంది మాత్రమే స్పందించి తక్కువ మొత్తంలో డబ్బులు సహాయం చేస్తున్నారు. ఇలాంటి... బాలయ్య ఎమ్మెల్యే గా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో ఉన్న... బాలయ్య అభిమానులు ఏకంగా లక్ష రూపాయల సహాయం చేసినట్లు వైసిపి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టడమే కాకుండా... బాలయ్య అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపింది వైసీపీ సోషల్ మీడియా. అలాగే పోసాని కృష్ణమురళి 2 లక్షలు సహాయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది.

పూరి జగన్నాథ్ రెండు లక్షలు, వేణుమాధవ్ ఫ్యామిలీ 10 వేలు, రమ ప్రభ 10k, అద్దంకి హనిమీ 50 వేలు, కొడాలి నాని లక్ష రూపాయలు, ఏపీ హోం మంత్రి అనిత 50 వేలు, జేసీ ప్రభాకర్ 20వేలు, జూపూడి ప్రభాకర్ 10 వేలు, అనిల్ కుమార్ యాదవ్ 50 వేలు ఇచ్చినట్లు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్టు... వైరల్ అవుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... ఈ పోస్ట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

facebook Link

https://www.facebook.com/share/p/1F7ck4qsZS/

Next Story