పులివెందులలో దాడులు.. గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |

పులివెందులలో జరిగిన దాడులపై గవర్నర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

పులివెందులలో దాడులు.. గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ(Pulivenduala) ఎన్నికల ప్రచారంలో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతలు దాడుల చేసుకున్నారు. ఈ దాడులో వైసీపీ ఎమ్మెల్సీ సహా అభ్యర్థికి గాయాలయ్యాయి. దీంతో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దౌర్జన్యంతో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. జడ్పీటీసీ ఎన్నికతో పాటు, టీడీపీ నేతలపైనా గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor)కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) ఆధ్వర్యంలో గవర్నర్‌ను విజయవాడలో కలిసి పులివెందుల ఘటనను వివరించారు. పులివెందల జడ్పీటీసీ ఎన్నికను పారదర్శకంగా జరిగేలా ప్రభాత్వాన్ని ఆదేశించాలని కోరారు. పులివెందుల వైసీపీ అడ్డగా అని, గందరగోళం సృష్టించి టీడీపీ కైవసం చేసుకోవాలని చూస్తుందని బొత్స ఆరోపించారు.

Next Story