- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YCP: విజయసాయి రెడ్డి బాటలోనే మరో నేత.. వార్తలపై క్లారిటీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ
రాజ్యసభ(Rajyasabha) సభ్యత్వానికి రాజీనామా వార్తలపై వైఎస్ఆర్సీపీ నేత(YSRCP Leader) క్లారిటీ(Clarity) ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభ(Rajyasabha) సభ్యత్వానికి రాజీనామా వార్తలపై వైఎస్ఆర్సీపీ నేత(YSRCP Leader) క్లారిటీ(Clarity) ఇచ్చారు. తాను రాజీనామా(Resign) చేస్తానని వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేశారు. దీంతో ఆయన బాటలోనే మరో ఎంపీ కూడా వెళ్లనున్నారని వార్తలు ఊపందుకున్నాయి.
మరో వారంలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి(Ayidhya Ramireddy) కూడా రాజీనామా చేస్తారని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా విదేశాల్లో ఉన్నారని, త్వరలోనే రాజీనామా చేస్తారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై ఓ ప్రకటన ద్వారా స్పందించిన అయోధ్య రామిరెడ్డి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేయడం లేదని, తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు. అంతేగాక తాను ప్రస్తుతం వేదేశీ పర్యటనలో ఉన్నానని, ఇండియాకు రాగానే మీడియా ముందుకు వస్తానని అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు.






