Shocking: వైసీపీ కార్యకర్తలను చితబాదిన జగన్ గన్‌మెన్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-14 13:26:32  IST  )

వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది....

Shocking: వైసీపీ కార్యకర్తలను చితబాదిన జగన్ గన్‌మెన్లు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(former Cm Jagan)ఉండగానే వాళ్లను గన్ మెన్లు దాడి చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వివాహ వేడకకు జగన్ హాజరయ్యారు. అయితే వివాహ కార్యక్రమానికి జగన్ హాజరయ్యే క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లారు. జగన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో జగన్ గన్ మెన్లు ఓవరాక్షన్‌కు పాల్పడ్డారు. జగన్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ కార్యకర్త చేతికి గాయాలయ్యాయి. ఈ సమయంలో తోపులాట జరగడంతో మహిళ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తమ అభిమాన నాయకుడికి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పా అంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. తమ అధినేత సమక్షంలోనే గన్ మెన్లు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.

Next Story