గవర్నర్ ప్రత్యేక ప్రసంగంపై యనమల కీలక వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

గవర్నర్లకు ఆ హక్కు ఉందన్న మాజీ మంత్రి.

గవర్నర్ ప్రత్యేక ప్రసంగంపై యనమల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : గవర్నర్ ప్రసంగం, రాజ్యాంగపరమైన అంశాలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో గవర్నర్ ప్రత్యేక ప్రసంగం అనేది ఒక తప్పనిసరి ప్రక్రియ అని అన్నారు. ఇది ప్రభుత్వ విధాన ప్రకటనగా నిలుస్తుందని యనమల పేర్కొన్నారు. రాబోయే ఏడాదిలో ప్రభుత్వం చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఈ ప్రసంగం ద్వారానే సభ్యులకు వివరిస్తారని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పంపిన తుది ప్రతికి అనుగుణంగా గవర్నర్లు ప్రసంగించకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన గుర్తుచేశారు.

సభలో అవాంతరాలు ఏర్పడినప్పుడు గవర్నర్లు తమ ప్రసంగంలోని సగం భాగం లేదా కేవలం చివరి కొన్ని వరుసలు మాత్రమే చదివి ముగించడం ఒక సాధారణ ఆనవాయితీ అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన తప్పు లేదని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అంశాలను గవర్నర్లు దాటవేస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి సమయాల్లో 'డీమింగ్ ప్రొవిజన్' (Deeming Provision) ఆనవాయితీ ప్రకారం ప్రసంగం మొత్తం చదివినట్లుగానే పరిగణించబడుతుందని వివరించారు. గవర్నర్ ప్రత్యక్షంగా చదవకుండా వదిలేసిన పేజీలు కూడా సభా రికార్డుల్లోకి వెళ్తాయన్నారు. తద్వారా ఆ ప్రసంగం సంపూర్ణంగా ముగిసినట్లుగానే భావించాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Next Story